99TV News

    Keerthy Suresh's 'Sathyavan Savithri' Teaser Out: కీర్తిసురేశ్ 'సత్యవాన్ సావిత్రి' టీజర...

    Keerthy Suresh's 'Sathyavan Savithri' Teaser Out: కీర్తిసురేశ్ 'సత్యవాన్ సావిత్రి' టీజర...

    ‘‘అబ్జెక్షన్‌ ఓవర్‌రూల్డ్‌..! సావిత్రి బాధ్యతలు చేపట్టారు.. అది కూడా అద్భుతమైన శైలిలో’’ అంటూ కీర్తిసురేశ్ (Keerthy Suresh) ప్రధాన పాత్రలో నటిస్తున్న కొత్త సినిమా ‘సత్యవాన్‌ సావిత్రి’ (Sathyavan Savithri) ప్రపంచాన్ని చిత్రబృందం పరిచయం చేసింది. ప్రచార కార్యక్రమాల్లో భాగంగా తాజాగా ఈ చిత్ర టీజర్‌ను సామాజిక మాధ్యమాల వేదికగా విడుదల చేశారు. ఈ సినిమా నవంబరు 20న గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది.

    ఈ చిత్రంలో కీర్తిసురేశ్‌తో పాటు ప్రముఖ దర్శకుడు మిస్కిన్‌ (Mysskin) మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ప్రవీణ్‌ ఎస్‌.విజయ్‌ దర్శకత్వం వహిస్తుండగా, ఎస్‌.శక్తివేల్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాల శరవణన్, శిల్పా మంజునాథ్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

    ఆకట్టుకుంటున్న టీజర్..

    ‘ఒకవేళ మీకు ఈ కేసులో ఏకపక్షంగా తీర్పు ఇవ్వమని రూ.పదిలక్షలు లంచం ఇస్తే.. మీరు అది ఎక్కడ తీసుకుంటారు’ అంటూ కోర్టురూమ్‌లో కీర్తిసురేశ్ అడిగిన ఆసక్తికరమైన ప్రశ్నతో ఈ టీజర్ ప్రారంభమవుతుంది. ఆద్యంతం వినోదభరితంగా సాగిన ఈ టీజర్‌లో చివరిగా ఆమె చెప్పిన డైలాగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

    ‘‘నాకు ‘లా’ అంటే చాలా ఇష్టం. పెద్ద న్యాయవాది అవ్వాలని ఆశపడి చదివాను. నా జీవితంలో ఒకే ఒక్క ఆశయం.. మార్కండేయ సర్‌లాగా లాయర్‌ అవ్వాలి’’

    అంటూ కీర్తిసురేశ్ చెప్పే మాటలు సినిమాపై మరింత అంచనాలను పెంచేస్తున్నాయి. విభిన్నమైన కథాంశంతో వస్తున్న ఈ కోర్టురూమ్ డ్రామా ప్రేక్షకులను ఏమేరకు అలరిస్తుందో నవంబర్ 20న తేలనుంది.